వరుస
ప్లాపులు, సినిమా భవిష్యత్పై అనుమానాలు....ఈ
నేపథ్యంలో హీరోగా తన భవిష్యత్ ఏమంత
ఆశాజనకంగా ఉండదని ముందే డిసైడ్ అయిన
విష్ణు ఇప్పటికే సినిమా నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
దీంతో పాటు మరో బిజినెస్
కూడా విష్ణు మొదలు పెట్టే యోచనలో
ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కార్పొరేట్ ప్లే
స్కూల్(మూడు సంవత్సరాల వయసు
లోపు పిల్లలకు ఆటలు నేర్పేబడి)స్థాపించాలని
చూస్తున్నట్లు తెలుస్తోంది.
విష్ణు
తండ్రి మోహన్ బాబు ఓ
వైపు సినిమా నటుడిగా, మరో వైపు నిర్మాతగా
కొనసాగుతూనే.....శ్రీ విద్యా నికేతన్
స్కూల్ స్థాపించి మంచి పేరు ప్రఖ్యాతలు
సంపాదించి నేపథ్యంలో తనుకూడా విద్యా రంగంలో రాణించాలనే యోచనలో విష్ణు ఉన్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు.
మంచు
విష్ణు త్వరలో ‘దొరకడు’ అనే చిత్రం ద్వారా
ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు
వినిపస్తున్న సంగతి తెలిసిందే. జి.
నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం
వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక
హీరోయిన్గా ఎంపికైంది. ఈ
చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు.
కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ
చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా నాగేశ్వర
రెడ్డి తెరకెక్కించనున్నాడు.
అయితే
ఈ చిత్రానికి ‘దొకరడు’ అనే టైటిల్ కాకుండా
‘దేనికైనా రెడీ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు
సమాచారం. ఇందులో విష్ణు పాత్ర దేనికైనా తెగించే
ధోరణిలో ఉంటుందని, అందుకే ఆ టైటిల్ పరిశీలిస్తున్నట్ల
సమాచారం. గతంలో విష్ణు నటించిన
‘ఢీ’ తరహాలోనే ఈ చిత్రం పూర్తి
వినోదాత్మకంగా సినిమా రూపొందిచే ప్రయత్నాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment