వరస ఏడు ప్లాపుల తర్వాత
‘గబ్బర్ సింగ్’తో శృతి హాసన్
తొలి విజయాన్ని అందుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా
హరీష్ శంకర్ రూపొందించిన ఈ
చిత్రం మార్నింగ్ షో కే హిట్
టాక్ తెచ్చుకుంది. దాంతో ఆమెను మీడియా
ఈ విజయాన్ని మీరు ఎలా సెలబ్రేట్
చేసుకున్నారు.. ఎలా ఫీలవుతున్నారు అని
అడిగింది. దానికామె మాట్లాడుతూ -‘‘మొన్నటిదాకా ‘ఐరన్ లెగ్’ అన్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ‘గోల్డెన్ లెగ్’ అంటున్నారు. పరిస్థితులను బట్టి మార్చుకునే అభిప్రాయాలను
నేను అస్సలు పట్టించుకోను అంది.
అలాగే
...నా గురించి పూర్తిగా నాకు తెలుసు. ‘గబ్బర్
సింగ్’
సినిమాకు సైన్ చేసినప్పుడే ఈ
సినిమా నాకు హిట్ని
ఇస్తుందనిపించింది. అయితే.. ఇంత హిట్ని
మాత్రం ఊహించలేదు. ఈ విజయానికి ప్రధానకారకుడు
పవర్ స్టార్. ఇది ఆయన విజయమే.
తర్వాతే ఎవరైనా. ఏదిఏమైనా నా యూనిట్ సభ్యులందరికీ
పేరుపేరున కంగ్రాట్స్ చెబుతున్నాను అంది. ఇక గబ్బర్
సింగ్ చిత్రంలో ఆమె భాగ్యలక్ష్మి పాత్రను
పోషించింది.
ఇక గబ్బర్ సింగ్ చిత్రం మొన్న
శుక్రవారం రిలీజై మార్నింగ్ షోకే సూపర్ హిట్
టాక్ తెచ్చుకున్న చిత్రం గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఖుషీ
తర్వాత ఇన్నాళ్లకు ఆ రేంజి హిట్
కొట్టాడంటున్నారు. దబాంగ్ రీమేక్ గా వచ్చిన ఈ
చిత్రం ఆ చిత్రంలోని సోల్
ని మాత్రమే తీసుకుని స్వతంగా హరీష్ కథ, కథనం
అల్లు కోవటమే ప్లస్ అయ్యిందంటున్నారు. పవన్,శృతిలకు ఇద్దరకూ ఈ చిత్రం బ్రేక్
ఇచ్చింది. తన నుంచి ప్రేక్షకులు
ఏమి ఆశిస్తున్నారో వాటిని చూపటం వల్లే హిట్
అయ్యిందని పవన్ చెప్తున్నారు.
అలాగే
దర్శకుడు హరీష్ శంకర్ కి
ఎన్టీఆర్ తో తదుపరి చిత్రం
రావటంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్‌ని
ఓ అభిమాని ఏ విధంగా చూడాలని
కోరుకుంటాడో ఆ విధంగా ఆలోచించి
ఆయన అభిమానిగా ‘గబ్బర్ సింగ్’ని తెరకెక్కించాను. పవన్
కళ్యాణ్ అందించిన స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఇంత
బాగా తీయగలిగాను. ఆయన నుంచి నేను
నేర్చుకున్న నీతి, నిబద్ధత, కఠిన
క్రమశిక్షణలే ఈ సక్సెస్కు
కారణం. ఈ సినిమా చూసిన
పెద్ద దర్శకులంతా నన్ను అభినందిస్తుండటం ఆనందంగా
వుంది. పవన్ నటనే నాకు
పెద్ద ఎస్సెట్ అయ్యింది అన్నారు.
0 comments:
Post a Comment