హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
దృతరాష్ట్రుడు అయితే వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి దుర్యోదనుడు అని, రాష్ట్ర మంత్రులు
కౌరవ సేనలు అని తెలుగుదేశం
పార్టీ నేత వర్ల రామయ్య
గురువారం మండిపడ్డారు. వైయస్ రాష్ట్ర ఖజానాను
దోపిడీ చేశాడని, పేదల సంక్షేమానికి చేరాల్సిన
ధనాన్ని తన కుమారుడు జగన్
బొక్కసానికి చేర్చాడని ఆరోపించారు.
జార్ఖండ్
ముఖ్యమంత్రిగా పని చేసిన మధుకొడా
రూ.మూడువేల కోట్లు అవినీతికి పాల్పడ్డాడని, కానీ వైయస్ ఆయనకు
పదిరెట్లు ఎక్కువ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రా మధుకొడా వైయస్ అని వర్ల
అన్నారు. శ్రీకాంత్ గౌడ్, మంగళి కృ,్ణలు వెంటాడుతున్నారంటూ మస్తాన్
రావు తన ఆత్మహత్యకు కారణాలు
వివరిస్తూ లేఖ రాశాడని, ఆ
ఆత్మహత్య వెనుక అదృశ్య శక్తి
ఉందని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ కూడా ఒక టివి
ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారన్నారు.
మస్తాన్
రావు ఆత్మహత్యకు కారణమైన అదృశ్య శక్తి హైదరాబాద్ సిటి
పోలీసు కమిషనర్ను శాసించే జగన్,
రాజశేఖర రెడ్డిలు కాదా అని ప్రశ్నించారు.
జగన్ పార్టీకి చెందిన ఉప ఎన్నికల అభ్యర్థులను
గమనిస్తే రాయదుర్గం అభ్యర్థి ఓబుళాపురం ఇనుపఖనిజాన్ని దోపిడీ చేసిన దొంగ అని,
ఒంగోలు అభ్యర్థి వాన్ పిక్ భూబకాసురుడు
అని, ఆళ్లగడ్డ అభ్యర్థి ఆరు వరుస హత్యలతో
సంబంధం ఉన్న వ్యక్తి అని,
ఎమ్మిగనూరు అభ్యర్థి వూళ్లకు వూళ్లే ఖాళీ చేయించిన అభ్యర్థి
అని ఆరోపించారు.
ఉప ఎన్నికల్లో వీళ్లను గెలిపిస్తే శాసనాలు తయారు చేయడం పక్కన
పెట్టి ఎలాంటి పరిస్థితులను తెస్తారో ప్రజలు ఆలోచించాలన్నారు. జగన్ ఒక అసాంఘిక
శక్తి అని వ్యాఖ్యానించారు. తండ్రీ
కొడుకుల అవినీతి వల్ల ప్రజా ధనం
జగన్ బొక్కసానికి చేరిందని, ఆ సొమ్మును ఇప్పటికైనా
వెనక్కు తీసుకొని పేదల సంక్షేమానికి వెచ్చించాలని
డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment