హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై
కుట్రలు పన్నాల్సిన అవసరం తమకు లేదని,
జగన్ అంత పెద్దోడేమీ కాదని
కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి అన్నారు. గురువారం
గాంధీ భవన్లో ఆయన
ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే కీలక నేతలు, మంత్రులు,
ఇతర ముఖ్యనేతల వివరాలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సమీక్షించారు.
ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈనెల
22న ఢిల్లీ వెళ్లి, మళ్లీ వెంటనే వచ్చేస్తానని,
ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ రాష్ట్రంలోనే ఉంటానని
ఆయన తెలిపారు. రాష్ట్రం వదిలి ఢిల్లీకి వెళ్తే
అక్కడి పెద్దలు ఎందుకు వచ్చావంటూ నిలదీస్తున్నారని నవ్వుతూ అన్నారు. ఉప ఎన్నికల్లో మెజారిటీ
స్థానాల్లో గెలుస్తామని ఆయన దీమాగా చెప్పారు.
గత పర్యటనలోకంటే ఈసారి పర్యటనలో కార్యకర్తల్లో
ఉత్సాహం గమనించానని వయలార్ అన్నారు. రాష్ట్ర నాయకత్వంపై విశ్వాసం, ధీమా పెరిగాయని తెలిపారు.
కాంగ్రెస్
అభ్యర్థులు విజయం సాధించకుంటే రాజకీయ
అనిశ్చితి నెలకొంటుందని తాను ఆళ్లగడ్డలో అనలేదని,
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆటంకం ఏర్పడుతుందని మాత్రమే
చెప్పానని అన్నారు. తనపై కాంగ్రెస్ పెద్దలు
కుట్ర చేస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలను ఆయన
ఖండించారు.
గాంధీభవన్లో వయలార్ను
మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య కలిశారు. 'ఈనెల 20న పరకాలలో బూత్
స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స హాజరవుతున్నారు.
ఈ భేటీకి మీరు కూడా రండి'
అని కోరారు. దీనిపై ఆలోచించి చెబుతానని వయలార్ చెప్పారు.
0 comments:
Post a Comment