కడప:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అయిన
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
పేరు వాడుకొని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య బుధవారం మండిపడ్డారు. ఆయన కడప జిల్లాలో
విలేకరులతో మాట్లాడారు. సంఘ విద్రోహ శక్తులతో
జగన్ చేయి కలిపారని ఆరోపించారు.
జగన్ సంఘ విద్రోహ శక్తిగా
ఎదిగి రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారన్నారు.
తన స్వార్థం కోసం నిజాయితీ అధికారులను
జైళ్లకు వెళ్లేలా బలి చేశారని ఆవేదన
వ్యక్తం చేశారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో
ఇంకా చాలా మందే ఉన్నారని
ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ఇప్పటికైనా తాను
చేసిన అక్రమాలపై ఆత్మ విమర్శ చేసుకోవాలని
సూచించారు. తన తప్పు ఒప్పుకొని
అప్రావర్గా మారాలని అన్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి బతికి ఉంటే జగన్
వ్యవహార శైలిని పూర్తిగా తప్పు పట్టే వారన్నారు.
జగన్ చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం
చేసే వారన్నారు. జగన్ రాష్ట్రంలో పారిశ్రామిక
వ్యవస్థను నాశనం చేశాడని మండిపడ్డారు.
జగన్ అవినీతి వల్లే రాష్ట్రంలో పెట్టుబడి
పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం
లేదని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలు, అధికారులను స్వలాభం కోసం జగన్ వాడుకొని
జైలుకు పంపించారన్నారు.
కాగా
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పట్టణ హోటల్ డిఆర్
ఉత్తమలో నగరానికి చెందిన మేధావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న సుబ్బి
రామిరెడ్డి విశాఖకు ఎంతో అభివృద్ధి చేశారని,
అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి నెల్లూరులో 1400 కోట్ల రూపాయలతో విద్యుత్
పరిశ్రమ స్థాపిస్తున్నారన్నారు.
0 comments:
Post a Comment