హైదరాబాద్:
నందమూరి బాలకృష్ణ నటించిన అధినాయకుడు సినిమాపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన
తరువాత నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్లాల్ వెల్లడించారు. తెలుగుదేశం
పార్టీకి అనుకూలంగా ఈ చిత్రంలో సంభాషణలు
ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భన్వర్లాల్కు ఫిర్యాదు
చేసిన విషయం తెలిసిందే.
సాక్షి
కథనాలను చెల్లింపు వార్తలుగా పరిగణించాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన విజ్ఞప్తిపై జిల్లా
స్థాయి కమిటీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఉప ఎన్నికలు జరిగే
ప్రాంతాల్లో తుది ఓటర్ల జాబితాను
ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తన పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంటే
నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని
నేతలకు సూచించారు.
ఉప ఎన్నికల్లో వ్యయాన్ని లెక్కచూపని పరకాల అభ్యర్థులపై ఎన్నికల
సంఘం కొరడా ఝళిపించింది. ఈ
నెల 5వ తేదీ లోపు
ఎన్నికల వ్యయాన్ని లెక్కచూపని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని
హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి భిక్షపతి యాదవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఈసీ
నోటీసులు జారీ చేసిన వారిలో
ఉన్నారు. దీనితో ఆయా అభ్యర్థులు ఉప
ఎన్నికల వ్యయాన్ని చూపించే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తోంది.
తనపై
ఎలాంటి ఆరోపణలు ఉన్నా మీడియాతో మాట్లాడే
కన్నా నేరుగా తననే కలిసి ఫిర్యాదు
చేయవచ్చునని ఆయన చెప్పారు. తెలుగుదేశం,
కాంగ్రెసు నాయకులు తన పనితీరు పట్ల
అసంతృప్తిగా ఉన్నట్లు తనకు తెలియదని ఆయన
అన్నారు. తాను మాత్రం వచ్చిన
ప్రతి ఫిర్యాదునూ స్వీకరిస్తున్నానని ఆయన చెప్పారు.
కాగా,
సాక్షి మీడియా అరాచకాలపై తాము ఎన్ని ఫిర్యాదులు
చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని కాంగ్రెసు నాయకులు
అసంతృప్తి వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కరపత్రంగా వ్యవహరిస్తున్న సాక్షిపై చర్యలు తీసుకోవాలని వారు శనివారం మరో
మారు భన్వర్లాల్కు ఫిర్యాదు
చేశారు. సాక్షి మీడియాలో ఇతర పార్టీలను కించపరుస్తూ
ఇచ్చే వార్తలను కోడ్ ఉల్లంఘనగాను, వైయస్సార్
కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ఇచ్చేవాటిని చెల్లింపు వార్తలుగానూ పరిగణించాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెసు నేతలు ఉమా మల్లేశ్వర
రావు, అనురాధ తదితరులు ఈసిని కలిసినవారిలో ఉన్నారు.
0 comments:
Post a Comment