కడప:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై,
కర్ణాటక మాజీ మంత్రి గాలి
జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
తీవ్రంగా ధ్వజమెత్తారు. కడప జిల్లా ఉప
ఎన్నికల ప్రచారంలో ఆయన శనివారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు
చేసుకుంది. దీనికి తమ కార్యకర్తల తరఫున
చంద్రబాబు పోలీసులకు క్షమాపణ చెప్పారు.
అన్ని
వ్యవస్థలనూ భ్రష్టు పట్టించి, వైయస్ జగన్ ఆర్థిక
ఉన్మాదిగా మారాడని ఆయన వ్యాఖ్యానించారు. పాపాలు
పండి వైయస్ జగన్ జైలు
పాలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి
ఆరోపణలతో గాలి జనార్దన్ రెడ్డి
న్యాయవ్యవస్థనే భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. న్యాయమూర్తులకే
కాదు, దేవుడికి కూడా గాలి జనార్దన్
రెడ్డి లంచాలు ఇచ్చే ఘనుడని ఆయన
అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి
దుర్మార్గాల వల్ల న్యాయమూర్తిని కూడా
అరెస్టు చేసే పరిస్థితి రాష్ట్రంలో
తలెత్తిందని ఆయన అన్నారు.
గాలి
జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి
మధ్యవర్తిగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని ఆయన
అన్నారు. ఏరాసు ప్రతాప రెడ్డిని
వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని
ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వానికి సిగ్గు లేదని తెలుగుదేశం నాయకుడు
వర్ల రామయ్య శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు
గాలి
బెయిల్ కుంభకోణంలో వైవీ సుబ్బారెడ్డి సూత్రధారి
అని ఆయన ఆరోపించారు. న్యాయ
శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైవీ సుబ్బా రెడ్డి
కలిసి కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఏరాసు
ప్రతాప రెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
మౌనం వహించడం సరి కాదని, ప్రతాప
రెడ్డితో రాజీనామా చేయించాలని ఆయన అన్నారు. వైవీ
సుబ్బారెడ్డికి, ఏరాసు ప్రతాప రెడ్డికి
బంధుత్వం ఉందని ఆయన అన్నారు.
ఏరాసు ప్రతాప రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని
ఆయన గవర్నర్ను కోరారు.
0 comments:
Post a Comment