హైదరాబాద్:
త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న
నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ చిత్రం అధినాయకుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా రాజకీయ నాయకుల నోళ్లలో బాగా నానుతోంది. ఉప
ఎన్నికలకు ముందు అధినాయకుడు చిత్రం
విడుదల కాకుండా చూడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, సాక్షి మీడియా వార్తలపై తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని
కూడా ఆశ్రయించారు.
అధినాయకుడు
చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈసికి ఫిర్యాదు చేసింది.
సినిమాలో బాలకృష్ణ వేసిన సెటైర్లపై
వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అదే సమయంలో ఉప ఎన్నికల ప్రచారానికి
తాను రాకపోయినప్పటికీ తన సినిమాను పంపిస్తున్నానని
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కూడా
వారు ప్రస్తావించారు. ఓ పార్టీకి అనుకూలంగా
ఈ చిత్రం ఉండటంతో దీని విడుదల ఆపాలని
వారు ఈసిని అభ్యర్థించారు(ఈసి
చిత్రం విడుదల ఆపేందుకు నో చెప్పడం వేరే
విషయం).
సినిమాలోని
డైలాగులతో పాటు బాలయ్య ప్లాటినం
డిస్క్ ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలపై
వైయస్సార్ కాంగ్రెసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం
చేసింది. తాను రాకపోయినప్పటికి ఉప
ఎన్నికల ప్రచారం కోసం తన సినిమాను
పంపిస్తున్నానని చెప్పడాన్ని వారు పాయింటవుట్ చేశారు.
అయితే తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు ధీటుగానే
స్పందించింది. అంతకుముందు నుండే టిడిపి సాక్షిలో
వచ్చే వార్తలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
సాక్షి
టివిలో, సాక్షి పత్రికలో వచ్చే వార్తలు వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని వారు చెప్పారు. అయితే
అధినాయకుడు సినిమా విడుదల ఆపాలని వైయస్సార్ కాంగ్రెసు ఈసికి ఫిర్యాదు చేసిన
అనంతరం సాక్షిపై టిడిపి మరింత మండిపడింది. మిగతా
ఛానళ్లలో అన్ని పార్టీల వార్తలకు
సమ ప్రాధాన్యం ఇస్తుంటే, సాక్షి మీడియా మాత్రం పూర్తిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు.
గురువారం
టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సాక్షి టీవీ చానెల్లో,
పత్రికలో ఇతర పార్టీల అభ్యర్థులకు
వ్యతిరేకంగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. సాక్షి
మీడియాపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని,
ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు సాక్షి టీవీ
చానెల్, పత్రికలపై, నమస్తే తెలంగాణ పత్రికపై, టి చానెల్పై
నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
మీడియా
ఓ పార్టీకి అనుకూలంగా వార్తలు ఇస్తే పెయిడ్ న్యూస్గా పరిగణించాలని కేంద్ర
ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆదేశాలు ఇచ్చిందని, ఇంత స్పష్టమైన మార్గదర్శక
సూత్రాలున్నా భన్వర్ లాల్ సాక్షి మీడియాపై,
నమస్తే తెలంగాణ, టి - చానెళ్లపై చర్యలు
తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
సాక్షి మీడియాలో వైయస్ రాజశేఖర రెడ్డికి
అనుకూలంగా రాస్తున్న వార్తాకథనాలను అభ్యర్థుల ఖర్చు కింద జమ
చేయాలని ఆయన అన్నారు.
అడ్వర్టయిజ్మెంట్లను మినహాయిస్తే సాక్షి మీడియాలో వార్తలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ప్రచార వార్తలు, ఇతర పార్టీల వ్యతిరేక
ప్రచారమని ఆయన అన్నారు. సాక్షి
మీడియా ప్రత్యక్షంగా, పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల కోసమే పనిచేస్తున్నాయని ఆయన
విమర్శించారు. భన్వర్ లాల్‌కు చాలాసార్లు
ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. భన్వర్లాల్పై, సాక్షి
మీడియాపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని
ఆయన చెప్పారు. అధినాయకుడు చిత్రంపై పరిశీలన చేసిన ఈసి సాక్షి
మీడియాపై ఎందుకు స్పందించడం లేదన్నారు.
0 comments:
Post a Comment