చిన్న
సినిమాను చిది మేస్తున్నారు.... స్మాల్
ప్రొడ్యూసర్లను నలిపేస్తున్నారు.... థియేటర్ల కేటాయింపులో దళారుల రాజ్యం నడుస్తోంది.... మాఫియా మాదిరి ముఠా కట్టారు..అందుకే
పరిశ్రమ ఇట్టా తగలడింది. అంటూ
దాసరి నారాయణరావుతో పాటు చిన్న నిర్మాతలతో
కూడిన ఆయన వర్గం సందు
దొరికినప్పుడల్లా తమ గళం వినిపించిన
సంగతి తెలిసిందే. ఆ కసితోనే ఫిల్మ్
చాంబర్ ఎన్నికల్లో చిన్న నిర్మాతలతో కూడిన
దాసరి వర్గం తమ్మారెడ్డిని నిలబెట్టింది.
భారీ మెజారిటీతో తమ్మారెడ్డి గెలిచారు. ఇప్పటి వరకు ఫిల్మ్ ఛాంబర్
ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్న సురేష్ బాబు
గద్దె దిగి ఆ స్థానంలో
తమ్మారెడ్డి కూర్చోబోతున్నారు.
ఇప్పటి
వరకు ప్రత్యర్థి వర్గంపై మాటల తూటాలు పేల్చిన
దర్శకరత్న దాసరి...తన వర్గానికి అధికారం
వచ్చింది కాబట్టి ఇకపై చేతల తూటాలు
పేల్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇంత
కాలం చిన్న నిర్మాతలను నలిపేసిన
పెద్ద నిర్మాలకు గడ్డు కాలం తప్పదనే
ఊహాగానాలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇప్పటి
వరకు పరిశ్రమలో పరిస్థితి పరిశీలిస్తే....స్టార్ హీరోల సినిమాలు, పెద్ద
ప్రొడ్యూసర్ల సినిమాలకు 1000కి పైగా థియేటర్లు
దక్కేవి. అదే చిన్న సినిమాలకు
ఒక్కోసారి 100 నుంచి 200 థియేటర్లు కేటాంచడానికి కూడా మీన మేషాలు
లెక్కబెట్టే వారట ఫిల్మ్ ఛాంబర్
పెద్దలు. ఇప్పుడు చిన్న నిర్మాతల ప్యానల్
చేతిలోకి చాంబర్ పగ్గాలు రావడంతో పరిస్థితి పూర్తిగా తల్లక్రిందులు కానుందని అంటున్నారు.
పెద్ద
హీరోలకు మరో షాకింగ్ న్యూస్
ఏమిటంటే...గతంలోలా వారి సినిమాలకు భారీగా
థియేటర్ల దక్కే అవకాశం లేదని,
థియేటర్ మాఫియాను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.
మరి ఈ నేపథ్యంలో ఓడిపోయిన
పెద్ద నిర్మాతల ప్యానల్ ఏం చేస్తుందో? ఎత్తులు
పై ఎత్తులు ఎలా సాగనున్నాయో...గెట్
రెడీ టు సీ...!
0 comments:
Post a Comment