లండన్,
జులై 30: ఎట్టకేలకు లండన్ ఒలింపిక్స్‌లో
భారత్ బోణి కొట్టింది. లండన్
ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు
(సోమవారం) రాయల్ ఆర్టిలరీ బరాక్స్‌లో జరిగిన 10మీ
రైఫిల్ షూటింగ్‌లో జరిగిన పురుషుల
10మీ ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో హైదరాబాద్‌కు
చెందిన గగన్ నారంగ్ కాంస్య
పతకాన్ని సాధించాడు. మొదటి స్దానాన్ని రొమేనియాకి
చెందిన అలెన్ జార్జి సొంతం
చేసుకోగా.. రెండవ స్దానాన్ని ఇటలీకి
చెందిన నికోల్ సాధించాడు. గగన్ నారంగ్ తన
పైనల్ రౌండ్‌లో 10.7, 9.7, 10.6, 10.7, 10.4, 10.6, 9.9, 9.5,
10.3, 10.7 స్కోరు చేశాడు.
దీంతో
ఒలంపిక్ పతకాల పట్టికలో భారత్
ఖాతా తెరించింది. ఈ ఘనత సాధించగానే
భారతీయ జెండా ఒలంపిక్స్ లో
రెపరెపలాడింది. అంతక ముందు జరిగిన
క్వాలిఫయర్ రౌండ్ రైఫిల్ షూటింగ్‌లో మొత్తం 600 పాయింట్లకు
గాను గగన్ నారంగ్ 598 పాయింట్లతో
మూడో స్దానంలో నిలిచి ఫైనల్‌కు చేరగా..
అభినవ్ బింద్రా 594 పాయింట్లతో 16వ స్దానంలో నిలిచి
ఒలింపిక్స్ నుండి నిష్క్రమణకు గురయ్యాడు.
గగన్
నారంగ్ విషయానికి వస్తే 53 ఇన్నర్ షాట్స్ కొట్టగా.. అభినవ్ బింద్రా 45 ఇన్నర్ షాట్స్ కొట్టాడు. భారత్ నుంచి షూటింగ్‌లో తొలిసారి 11 మంది
బరిలోకి దిగారు. 2008 బీజింగ్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన
అభినవ్ బింద్రా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినప్పటికీ..
క్వాలిఫికేషన్ రౌండ్ లోనే ఇంటి
దారి పట్టాడు.
అంతక
ముందు మీడియాతో మాట్లాడిన గగన్ నారంగ్ గత
ఒలింపిక్స్‌లో సాధించలేనిది ఈ
సారి తప్పకుండా సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఈ సందర్బంలో నారంగ్
మాట్లాడుతూ సాదారణంగా టెన్నిస్, స్విమ్మింగ్ లో మాదిరి షూటింగ్‌లో ఫేవరేట్స్ ఉండరు.
క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్దానంలో
నిలిచిన వారికి, చివరి స్దానంలో నిలిచిన
వారికి కేవలం కొద్ది పాయింట్లు
తేడా మాత్రమే ఉంటుందన్నాడు. చెప్పినట్లుగానే 10మీ ఎయిర్ రైఫిల్‌లో కాంస్య పతకాన్ని
సాధించాడు. వీటితో పాటు గగన్ 50మీ.
రైఫిల్ ప్రోన్ (ఆగస్టు3), 50మీ. రైఫిల్ 3 పొజిషన్
(ఆగస్టు 6)లోనూ పాల్గొంటున్నాడు.
0 comments:
Post a Comment