విజయవాడ:
కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి కైకలూరు కోర్టు ఏడాది జైలు శిక్ష
విధించింది. వేయి రూపాయల జరిమానా
విధించింది. శవంతో ఆర్డీవో కార్యాలయం
ముందు ధర్నా నిర్వహించి అధికారుల
విధులకు ఆటంకం కలిగించినందుకు నానిని
దోషిగా కోర్టు నిర్ధారించి, శిక్షను ఖరారు చేసింది. ఈ
కేసులో నానికి 353 సెక్షన్ కింద ఏడాది జైలు
శిక్ష, 426 సెక్షన్ కింద వేయి రూపాయల
జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
నాని
2005లో ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు.
అప్పీల్ కోసం నానికి కోర్టు
నెల రోజుల గడువు ఇచ్చింది.
గుడివాడ శాసనసభా నియోజకవర్గంలో మోషి అనే వ్యక్తి
ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తనకు అందడం లేదని
ఆరోపిస్తూ అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో గుడివాడ ఆర్డీవో కార్యాలయం ముందు అతని శవంతో
నాని వందలాది మందితో ధర్నా చేశాడు. ధర్నా
రోజంతా సాగింది. నాని ధర్నాపై అప్పటి
నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. సాక్షులను
విచారించిన తర్వాత కోర్టు సోమవారం ఈ కేసులో తీర్పును
వెలువరించింది.
తెలుగుదేశం
పార్టీని గుడివాడ శాసనసభ్యుడిగా గెలిచిన కొడాలి నాని ఇటీవల వైయస్సార్
కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను, అధ్యక్షుడు
వైయస్ జగన్‌ను కలిశారు.
దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ
నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆయన సిద్ధపడ్డారు. వచ్చే
ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు తరఫున గుడివాడ నుంచి
పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. తనను
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన
తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై
తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
0 comments:
Post a Comment