సంస్థ:
పద్మిని ఆర్ట్స్
నటీనటులు:
సుమంత్ అశ్విన్, రియా, పరుచూరి వెంకటేశ్వరరావు,
ప్రభు, నాగబాబు, విజయ్‌చందర్, సాయాజీ
షిండే తదితరులు
మాటలు:
పరుచూరి బ్రదర్స్,
కెమెరా:
ఎస్.గోపాల్‌రెడ్డి,
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎం.ఎస్.రాజు
సమర్పణ:
దిల్ రాజు,
నిర్మాత:
మాగంటి రామ్‌చంద్రన్ (రామ్‌జీ),
విడుదల:20-07-2012
వంటవాడు(ప్రభు)కి తన
యజమాని(నాగబాబు)తో మంచి స్నేహం.
అయితే వారి పిల్లలు మాత్రం
వీరికి భిన్నంగా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కొట్టుకుంటూంటారు.
కొట్టుకునే వాళ్లే తదుపరి కాలంలో ప్రేమలో పడతారనే సినీ థియరీప్రకారం పెద్దయ్యాక
కార్తీక్ రామస్వామి (సుమంత్ అశ్విన్), నిధి (రియా) యధావిధిగా
తన భాధ్యతగా ప్రేమలో పడతారు. అయితే వీరి ప్రేమని
అడ్డుకోవటానికి హీరోయిన్ తండ్రి నాగబాబు ఆస్తిపై కన్నేసిన మరో కుటుంబం (వినోద్
కుమార్) కథ లోకి ప్రవేశిస్తుంది.
తమ కొడుకుకి హీరోయిన్ తో పెళ్లి చేసి
ఆస్తి ఆక్రమించటం కోసం...ఆ విలనీ కుటుంబం
హీరో, హీరోయిన్ల ప్రేమలో, వాళ్ల తండ్రుల స్నేహంలో
చిచ్చుపెడతారు. అలా విడిపోయిన ఆ
ప్రేమికులు చివరకు ఎలా కలిసారు అన్నది
తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
పేదోడ్ని
కొట్టగలరు కానీ ప్రేమికుడిని కొట్టలేరు
వంటి డైలాగులతో వచ్చిన ఈ చిత్రం ఫస్టాఫ్
సరదాగా గడిచిపోయినా సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది.
ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ ప్రేమను
విడకొట్టడానికి లేడీ విలన్స్ వేసే
ఎత్తుకు పై ఎత్తులతో టీవి
సీరియల్ వాతావరణం క్రియేట్ అయ్యింది. దానికి తోడు హీరో తన
ప్రేమకి విలన్స్ అడ్డుపడుతున్నారనే విషయం పట్టించుకోకుండా... ఎలాగూ క్లైమాక్స్
లో విధి తమని కులుపుతుందన్నట్లు
ఏమీ చెయ్యకుండా ప్యాసివ్ గా చూస్తూంటాడు. అదే
ఈ సినిమాకు బేస్ గా తీసుకున్న
ప్రేమ పావురాలు (సినిమాలో కూడా పావురం మొదటి
నుంచి చివరి వరకూ ఉంటుంది)లో కూడా హీరో
తన ప్రేమ కోసం ఇంట్లోకి
బయటకు వచ్చి తన వంతు
ప్రయత్నం చేస్తూంటాడు.
అలాగే..
ఇదే బ్యానర్ లో వచ్చి హిట్టైన
నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లో
కూడా సిద్దార్ద తన ప్రేమని గెలుపించుకోవటం
కోసం వ్యవసాయం చేసి ప్రేక్షకుల మనస్సు
గెలుస్తాడు. ఆ ఏక్టివ్ నెస్సే
కథలో మిస్సైంది. దాంతో కొత్తగా పరిచయమైన
హీరో ఉషారుగా, ఏక్టివ్ ఎంత పాటలు పాడినా,డాన్స్ చేసినా డల్ గానే నడుస్తూంటుంది.
ఏమి చెయ్యని హీరోని హర్షించటం కష్టం కదా.
ఇక ఇందులో ప్లస్ ల విషయానికి
వస్తే ఫస్టాఫ్ లో ఫన్ గా
సీన్స్ బాగానే నడుస్తాయి. హీరోయిన్, హీరో మధ్య వచ్చే
మూడో పాట బావుంటుంది. అయితే
కార్తీక్ రాజా బ్యాక్ గ్రౌండ్
స్కోర్ మాత్రం సరిగ్గా ఇవ్వలేదనిపిస్తుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది.
ఎడిటింగ్ .. సెకండాఫ్ ని లెంగ్త్ తగ్గించి
మరింత క్రిస్ప్ గా చేస్తే బావుండేదనిపిస్తుంది.
డైలాగులు అక్కడక్కడా పేలాయి. కానీ ఇంకా పాత
సినిమాల్లో లాగ.. రవింద్రబాబు గారూ..
వంటివి అనటమే ఎబ్బెట్టుగా ఉంది.
పరుచూరి వెంకటేశ్వరరావు పాత్ర కేవలం ఈ
కథ పేద, ధనిక మధ్య
జరిగే కథ అని చెప్పటానికే
ఉన్నట్లుగా మొదటి నుంచి చివరి
వరకూ మలిచారు. ప్రభు వంటవాడుగా నప్పాడు.
అయితే ఆ మాత్రం తెలుగు
ఆర్టిస్టులు మనకూ ఉన్నారుగా,వారిని
తీసుకోవచ్చుగా అనిపిస్తుంది. హీరోయిన్ కి సెక్సప్పీల్, రొమాంటిక్
లుక్ లేదు.
ఫైనల్
గా పాత చింతకాయపచ్చడిగా తయారైన
ఈ చిత్రం ప్రేమ కధా చిత్రంగా
నచ్చకపోవచ్చు కానీ ఫ్యామిలీలతో ఏదో
ఒక సినిమా సినిమా చూద్దాం అనుకనే వారికి ఓ ఆప్షన్. ఇక
ఎమ్.ఎస్ రాజు దర్శకుడుగా
మొదటి సినిమా కన్నా బాగానే చేసారు.
ఆయనకి ఇతర భ్యానర్స్ నుంచి
దర్శకుడుగా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. ఆయన కుమారుడు మాత్రం
యాక్షన్ తో కూడిన ప్రేమ
కథా చిత్రాలుకు బుక్ అయ్యే అవకాసం
ఉంది. అలా జరిగితే ఆయన
టార్గెట్ నెరవేరినట్లే.
0 comments:
Post a Comment