హైదరాబాద్ : పవన్ కళ్యాణ్,శృతి హాసన్ కాంబినేషన్ లో రూపొందిన ‘గబ్బర్ సింగ్' చిత్రం వంద రోజులు ఆగస్టు 18 కి పూర్తవుతుంది. ఈ మధ్య కాలంలో ఫేక్ కలెక్షన్స్ కాకుండా నడిచిన ఈ చిత్రం పవన్ కెరీర్ లో పెద్ద హిట్ గా నమోదైంది. ఈ చిత్రం 54 సెంటర్లలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఆ ధియోటర్ల వివరాలు ఏరియా వైజ్ గా...(ట్రేడ్ లో ఉన్న సమాచారం బట్టి)
ఏరియా వైజ్ సెంటర్స్ థియోటర్ల సంఖ్య
నైజాం 06
సీడెడ్ 17
కృష్ణా 03
గుంటూరు 05
వైజాగ్ 11
వెస్ట్ గోదావరి 09
ఈస్ట్ గోదావరి 03
మొత్రం 54
ఇక ఈ చిత్రం వంద రోజుల పంక్షన్ ని గ్రాండ్ గా ఆగస్టు 19న చేయటానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ ఈ పంక్షన్ కి హాజరయ్యే అవకాసం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్..పూరి తో చేస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబు బిజీలో ఉండటంతో సమయం లభ్యతను బట్టి ప్లాన్ చేస్తారంటున్నారు కానీ ఈ పంక్షన్ జరగపోవచ్చునని తెలుస్తోంది. కేవలం వంద రోజుల రోజు నిర్మాత,దర్శకులతో మీడియా సమావేసం నిర్వహించే అవకాసం ఉందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.
0 comments:
Post a Comment