విజయవాడ: అబ్దుల్ కలాం వంటి గొప్ప వ్యక్తిని రాష్ట్రపతిని చేసింది తమ పార్టీయేనని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ అన్నారు. వల్లభనేని వంశీ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ హయాంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మతకలహాలకు తావులేకుండా వినాయకచవితి, రంజాన్ తదితర పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని అన్నారు.
ముస్లింలకు తమ పార్టీ దగ్గరవుతుందనే అక్కసుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస రావు, మాల్లాది విష్ణు, జోగి రమేష్‌లు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీల సంక్షేమం టిడిపి ఆవిర్భావం నుంచే కృషి చేస్తోందన్నారు. అబ్దుల్ కలాం వంటి ఉత్తముడిని చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిగా చేశారన్నారు.
తొమ్మిది వేల మసీదుల నిర్మాణం, 500 షాదీఖానాలు మంజూరు, దుకాన్ ఔర్ మకాన్ పథకం, రోషిణి పథకం, ఉర్దూ పాఠశాలలు తదితర వాటిని ఏర్పాటు చేసింది చంద్రబాబు హయాంలోనే అన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించగానే ఇతర పార్టీల వెన్నులో వణుకు పుడుతోందన్నారు.
0 comments:
Post a Comment