ద్విచక్ర
వాహనంపై రైడ్ చేస్తున్నప్పుడు హెల్మెట్
ధరించడం తప్పనిసరి అని మోటార్ వాహన
చట్టంలో పర్కొనబడి ఉంది. అయితే, ఈ
నిబంధనను మహిళలు, సిక్కులు (టర్బన్ ధరించే వారు) పాటించాల్సిన అవసరం
లేదు. అయితే, దీనిపై స్పందించిన ఓ భారతీయ పౌరుడు,
మోటార్ వాహన చట్టంలోని ఈ
సడలింపును సవాల్ చేస్తూ ఓ
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిఐఎల్) అఫడవిట్ను ఇటీవలే ఢిల్లీ
హైకోర్టులో ఫైల్ చేశాడు.
ఈ అంశాన్ని పరిశీలించిన ఢిల్లీ హై కోర్టు, ఇకపై
రాజధాని రోడ్లపై టూవీలర్ సవారీ చేసే అమ్మాయిలు,
మహిళలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనను జారీ చేసింది. ఈ
మేరకు కావల్సిన సవరణలను మోటార్ వాహన చట్టం 1993లో
చేయనున్నారు.
టూవీలర్పై ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాల
బారిన పడి తలకు బలమైన
గాయాలు తగిలి ప్రతి ఏటా
60 నుండి 70 మంది మహిళలు మరిణిస్తున్నారని,
వెనుక కూర్చిని ప్రయాణించే వారికి హెల్మెట్ను తప్పనిసరి చేస్తూ
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్‌ను
ఫైల్ చేసిన సోషల్ ఫిల్మ్మేకర్ ఉల్హాస్ పిఆర్
అన్నారు. చట్టం కోసం కాకపోయినా
మన సురక్షిత కోసమైనా హెల్మెట్ ధరించడం ఎంతో అవసరం. మీరేమంటారు..?
0 comments:
Post a Comment