కర్నూలు:
తనను ఒక్కడిని రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి9.. అందరూ కలిసి ఒక్కటై..
తనకు చెందిన సాక్షి దిన పత్రిక, సాక్షి
టివిని మూసేయించాలని కుట్ర చేస్తున్నారని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విమర్శించారు. ఆయన కర్నూలు జిల్లా
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించారు.
సాక్షిని
మూసేయిస్తే ఎల్లో మీడియా రాసిన
రాత తప్ప మరొకటి వినపడదనే
ఉద్దేశ్యంతోనే వీరు ఇలా చేస్తున్నారన్నారు.
వారి చీకటి రాజకీయాలను ప్రజలు
గమనిస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ధరావత్తు కూడా దక్కదని మండిపడ్డారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సిఎం
కుర్చీలో మనసున్న మారాజులే కరువయ్యారన్నారు. పేదలు, రైతుల కోసం రాజీనామా
చేసిన శోభా నాగి రెడ్డిని
గెలిపించాలని ఆయన వోటర్లకు సూచించారు.
గిట్టుబాటు
ధరలు లేక రైతులు అల్లాడుతున్నారన్నారు.
ప్రభుత్వం ఫీజు రియింబర్సుమెంట్స్ చెల్లించక
పోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. వైయస్ మరణం తర్వాత
ఆయన ప్రవేశ పెట్టిన ఏ పథకాలను ప్రభుత్వం
సక్రమంగా అమలు చేయడం లేదని
విమర్శించారు. కాంగ్రెసు సర్కారు పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్నారు.
ప్రజల
శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వైయస్ రాజశేఖర రెడ్డి
108, 104 సేవలను ప్రారంభించారన్నారు. ఎన్నో పథకాలను ప్రభుత్వం
మూలన పడేసిందన్నారు. గుజరాత్, తమిళనాడులలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు ఉచితంగా భూములు ఇస్తున్నప్పటికీ సిబిఐకి అది కనిపించదని, కానీ
మన రాష్ట్రంలో మాత్రం ఎమ్మార్ కేసును విచారిస్తున్నారన్నారు.
0 comments:
Post a Comment