హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అందరినీ
జైలుకు పంపాలని చూస్తున్నాడని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు లింగారెడ్డి విమర్శించారు. రామోజీ సంస్థల్లో పెట్టుబడులు పెడితే తప్పు లేదు కానీ
సాక్షిలో పెట్టుబడి పెడితే తప్పా? అంటూ జగన్ ప్రశ్నించడాన్ని
ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తప్పు పట్టారు. వైయస్
రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకుని జగన్ ఆర్థిక ప్రయోజనం
పొందారు, రామోజీరావు రాజకీయ నాయకుడు కాదు, వాళ్ల తండ్రి
ముఖ్యమంత్రి కాదు, ఆయన కనీసం
గ్రామ పంచాయితీ బోర్డు మెంబర్ కూడా కాదని, అధికార
దుర్వినియోగానికి ఎలా పాల్పడతాడని ప్రశ్నించారు.
రామోజీరావు,
రాధాకృష్ణలతో పాటు ఎనిమిది కోట్ల
మంది ప్రజలు జైలుకు వెళితే గానీ జగన్కు
సంతృప్తి కలగదని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్
అధికారులను జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలు జరిగే
అన్ని స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని
అన్నారు. ఉప ఎన్నికల్లో జగన్
పార్టీ గెలిస్తే, అవినీతికి ప్రజలు ఆమోద ముద్ర వేసినట్టేనని,
అవినీతికి లైసెన్స్ను రెన్యువల్ చేసినట్టేనని
అన్నారు. అవినీతి, అక్రమాల, అసమర్థ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్లను మట్టికరిపించి టిడిపిని
గెలిపించాలని కోరారు.
వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పచ్చి అబద్ధాలకోరు అని ప్రదేశ్ కాంగ్రెస్
కమిటీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి విమర్శించారు. సాక్షి పత్రికను, సాక్షి చానల్ను మూసి
వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని చేసిన
విమర్శల్లో ఏ మాత్రం వాస్తవం
లేదని ఆయన శుక్రవారం విడిగా
మీడియా ప్రతినిధులతో అన్నారు. మీడియా స్వేచ్ఛ అనే కవచం కింద
రక్షణ పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్
పార్టీ మొదటి నుంచి మీడియా
స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, 1955 సంవత్సరంలోనే నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు చట్టం తెచ్చారని, కాంగ్రెస్
అధికారంలో ఉన్నప్పుడే ఏడు పర్యాయాలు జర్నలిస్టుల
వేజ్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన
వివరించారు. ఆరోగ్యశ్రీ, విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్
తదితర పథకాలపై జగన్ అసత్య ప్రచారాలు
చేస్తున్నారని ఆయన విమర్శించారు.
0 comments:
Post a Comment