నెల్లూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నెల
రోజుల్లో జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. వైయస్ జగన్ ఈ
జన్మలో ముఖ్యమంత్రి కాలేరని ఆయన శనివారం నెల్లూరులో
అన్నారు. జగన్పై కాంగ్రెసు
శ్రేణులు తిరగబడతాయని ఆయన అన్నారు. జగన్
ముఖ్యమంత్రి అయితే మహిళలు తాళిబొట్లు
కూడా అమ్ముకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన దీమా వ్యక్తం
చేశారు. కడప జిల్లా మినహా
మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ
సేకరణ జరిపితే జగన్కు వ్యతిరేకంగానే
ప్రజలు స్పందిస్తారని ఆనయ అన్నారు. గుంటూరు
నుంచి శ్రీకాకుళం వరకు జగన్ పార్టీ
ఒక్క సీటు కూడా గెలువదని
ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా బ్యాలెట్ నిర్వహిస్తే కడప మినహా మిగతా
అన్ని ప్రాంతాల్లో జగన్ జైలుకు వెళ్లడం
న్యాయమని తేలుతుందని ఆయన అన్నారు.
వైయస్
జగన్పై కాంగ్రెసు సీనియర్
నేత వి. హనుమంత రావు
మరోసారి ధ్వజమెత్తారు. అధికారులను, మంత్రులను విచారిస్తున్నప్పుడు సిబిఐ వైయస్ రాజశేఖర
రెడ్డి ఆత్మ కెవిపి రామచందర్
రావును విచారిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. ఆయన
శనివారం హైదరాబాదులో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. అనంతరం
ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్పై
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
విమర్శలు పెంచడం సంతోషకరమని, మొదటి నుంచి ఇలా
చేసి ఉంటే జగన్ ఇంత
దూరం వచ్చి ఉండేవాడు కాదని
ఆయన అన్నారు.
వైయస్
జగన్లో పశ్చాత్తాపం కనిపించడం
లేదని ఆయన అన్నారు. తన
వద్ద ఉన్న ఆధారాలను లగడపాటి
రాజగోపాల్ సిబిఐకి ఇస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరుమలలో
వైయస్ జగన్ హంగామాకు నిరసనగా
ఈ నెల 31వ తేదీన
తాను తిరుమలలో మౌన దీక్ష చేస్తానని
ఆయన చెప్పారు. ఈ నెల 28వ
తేదీన జగన్ కోర్టుకు హాజరయ్యే
సమయంలో శాంతిభద్రతల సమస్య వస్తే ముఖ్యమంత్రి,
డిజిపి చూసుకుంటారని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment