రొమాంటిక్
హీరోగా పేరున్న నాగార్జున ప్రక్కన చేయటానికి ఎప్పూడూ హీరోయిన్స్ తహతహలాడుతూంటారు. యాభైల్లో పడ్డా నాగార్జున క్రేజ్,గ్లామర్ కొద్దిగా కూడా తగ్గకపోవటంతో యంగ్
హీరోయిన్స్ సైతం ఆయనతో చేయటానికి
ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో
కాజల్ అగర్వాల్ చేరనుందని తెలుస్తోంది. నాగచైతన్య సరసన దడ చిత్రంలో
చేసిన ఈమె త్వరలో నాగార్జున
సరసన భాయ్ చిత్రం చేయటానికి
కమిటైనట్లు తెలుస్తోంది. దడ చిత్రం భాక్సాఫీస్
వద్ద వర్కవుట్ కాలేదు కానీ నాగార్జున మాత్రం
ఆమెకే ఫ్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు.
నాగచైతన్య
తండ్రి నాగార్జునతో కూడా ఆమె కలిసి
నటించే అవకాశం దక్కించుకోవడం సినీవర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.బిజినెస్ మేన్ భారీ విజయంతో
జోరు మీదన ఉన్న కాజల్
ప్రస్తుతం తమిళంలో మాట్రాన్, తుపాకి అనే చిత్రాల్లో నటిస్తోంది.
అదే విధంగా ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న ‘బాద్ షా’ చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది.
ఇక భాయ్ చిత్రాన్ని వీరభద్ర
చౌదరి డైరక్ట్ చేయనున్నారు. అహనా పెళ్లంట,పూల
రంగడు చిత్రాలతో కామీడి చిత్రాలు తీసి హిట్ కొట్టగలడనే
పేరు తెచ్చుకున్న వీరభద్రం ఈ చిత్రంతో హాట్రిక్
హిట్ కొడతానని నమ్మకంగా ఉన్నారు. మొదట ఈ చిత్రాన్ని
అధినాయకుడు తీసిన ఎమ్.ఎల్
కుమార్ చౌదరి తీస్తాడని నమ్మకంగ
ఉన్నారు. అయితే అధినాయుకుడు చిత్రంతో
పూర్తిగా ఫైనాన్సియల్స్ ట్రబుల్స్ లో మునిగిపోయిన చౌదరితో
కష్టమని జెమినీ కిరణ్ కి ఈ
ప్రాజెక్టు అఫ్పచెప్పినట్లు సమాచారం.
నాగార్జున
ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘షిరిడి సాయి’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు భక్తుడిగా
అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి విజయవంతమైన చిత్రాల్లో
నటించిన నాగ్, షిరిడి సాయి
చిత్రంలో తొలిసారి దేవుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడు. అలాగే తన తండ్రి
నాగేశ్వరరావు,తన కుమారుడు నాగచైతన్యలతో
కలిసి త్రయం అనే చిత్రం
చేస్తున్నారు. ఇష్క్ దర్శకుడు విక్రమ్
కుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్
చేస్తున్నారు.
0 comments:
Post a Comment