పవన్
కళ్యాణ్‌తో వంద సినిమాలు
చేయగలను. ఆయనతో చేయటానికి మరో
స్క్రిప్ట్ తయారు చేస్తున్నాను. దానికి
ఆయన ఎలా స్పందిస్తారో నాకు
తెలియదు. ఇప్పుడే స్క్రిప్ట్ గురించి మాట్లాడటం బాగుండదు అని గబ్బర్ సింగ్
దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. పవన్
కళ్యాణ్, శృతి హాసన్ జంటగా
ఆయన దర్శకత్వం వహించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ఇటీవల విడుదలైంది. విడుదలైన
తొలి రోజునే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త ఒపెనింగ్స్ను రాబట్టుకుంది. ఈ
నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఇలా స్పందించారు.
అలాగే
...పవన్ కళ్యాణ్‌తో షూటింగ్ చేయటం
అద్భుతమైన అనుభవం. సినిమాకు ఆయన వెన్నెముకగా నిలిచారు.
థియేటర్లో 'ఖుషీ', 'తొలి ప్రేమ', 'తమ్ముడు'
చిత్రాలను ముప్పై సార్లకు పైగా చూసుంటాను. ఆయన
స్టైల్ నుంచి నేనింకా బయటపడలేదు
అని హరీష్ శంకర్ నవ్వుతూ చెప్పారు . అలాగే ఎంఎన్నార్ కళాశాలలో
చదువుకునే రోజుల్లో పవన్ డైలాగులు చెబుతుండేవాడిని.
ఆయన స్టైల్లో డ్యాన్సులు చేసేవాణ్ణి.
మాకందరికి ఆయన యూత్ ఐకాన్
లాంటివారు. పవన్ డ్రస్సులు ధరించే
వైనం, తెరపై ఆయన చేసే
మ్యాజిక్ అద్భుతం అని గుర్తు చేసుకున్నాడు.
ఇక గబ్బర్ సింగ్ డైరక్షన్ ఛాన్స్
రావటం గురించి సైతం ఆయన చెప్పుకొచ్చారు.
షోలే' సినిమా అంటే జనాల్లో ఇప్పటికీ
క్రేజ్ ఉంది. ఇక గబ్బర్
సింగ్ పాత్ర గురించి కొత్తగా
చెప్పాల్సిన పనిలేదు. 'దబ్బంగ్' సినిమా అసలు సిసలు తెలుగు
సినిమా తరహాలో పక్కా వినోదాత్మక చిత్రం.
దాంతో ఆ సినిమా రీమేక్తో ముందు సాగాం
హరీష్ తెలిపాడు.
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ''ఎన్టీఆర్తో సినిమా ఖరారైంది.
ఆయనకు స్క్రిప్ట్ వినిపించాను. ఎన్టీఆర్కు నచ్చింది. తారాగణం
కూడా ఖరారైంది. కానీ అదంతా ఇప్పుడు
ప్రకటించటం బాగుండదు. త్వరలో అధికారిక ప్రకటన చేస్తాను'' అని అన్నారు.
0 comments:
Post a Comment