Showing posts with label Nara Chandrababu Naidu. Show all posts
Showing posts with label Nara Chandrababu Naidu. Show all posts

Friday, July 20, 2012

Nara Lokesh and Jr Ntr compromise formula

హైదరాబాద్: తన కుమారుడు నారా లోకేష్, అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ - ఇద్దరినీ పార్టీ కోసం వాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీ ఫార్ములాను రూపొందిస్తున్నట్లు సమాచారం. పార్టీకి యువరక్తం అవసరమని భావిస్తున్న చంద్రబాబు నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య హెచ్చుతగ్గుల తేడాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. దానికి ముందుగా బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

పార్టీలో మరింత పెద్ద బాధ్యతలు నిర్వహించడానికి బాలకృష్ణ వచ్చే నెలలో సిద్ధపడతారని అంటున్నారు. ఆయన పూర్తి స్థాయిలో పోలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారని, ఆయనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గానీ అప్పగిస్తారని అంటున్నారు. దీంతో నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణ కూడా పార్టీలో కీలకం కానున్నారు. ఇరువురి మధ్య పొరపొచ్చాలు లేకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారని అంటున్నారు.

బాలకృష్ణ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ క్రియాశీలక పాత్రల్లోకి వస్తారని, వారిద్దరినీ బాలకృష్ణ నేతృత్వంలో పనిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తారని అంటున్నారు. నారా లోకేష్‌తో సమానమైన హోదాను కలిగిస్తూ బాబాయ్ బాలయ్య నాయకత్వంలో పనిచేయడానికి జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చునని అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడేనని బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు. నాయకత్వ మార్పును కూడా ఆయన తోసిపుచ్చారు. చంద్రబాబును పెద్ద దిక్కుగా పెడుతూ నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు కలిసి పనిచేసే విధంగా ఓ ఫార్ములా తయారవుతున్నట్లు చెబుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక వేదిక వస్తారని బాలకృష్ణ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. కాగా, నందమూరి హీరోలు కేవలం ప్రచారం కోసం మాత్రమేననే అభిప్రాయాన్ని తొలగించి, వారు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారనే అభిప్రాయాన్ని కలిగించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అంటున్నారు.

ప్రస్తుతం చంద్రబాబుతో కలిసి పార్టీ పోలిట్‌బ్యూరోలో 16 మంది సభ్యులున్నారు. 11 మంది ప్రధాన కార్యదర్శులున్నారు. పోలిట్‌బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆమె వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశం ఉంది.

Thursday, April 5, 2012

వైయస్ జగన్పై చంద్రబాబు వైయస్ జగన్ అవినీతి పుస్తకాల దాడికి ప్లాన్


హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై వరుస పుస్తకాలు ప్రచురించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్ అవినీతి కార్యకలాపాలను ఎత్తిచూపుతూ ఆంగ్లంలో పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా వాటిని ప్రచురించి ప్రజలకు పంచిపెట్టే వ్యూహంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పేరుతో ఓ పుస్తకాన్ని, ప్రజాస్వామ్యానికి మైనంగ్ మాఫియా ముప్పు అనే పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచురించింది. వాటిని వివిధ పార్టీల జాతీయ నాయకులకు, కేంద్ర మంత్రులకే కాకుండా ప్రధానికి కూడా అందజేసింది. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిపై తాము చేసిన ఆరోపణలు, తాము ఎత్తిచూపిన గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కార్యకలాపాలు నిజమని తేలాయని ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటోంది.

గతంలో ఆ రెండు పుస్తకాలు ఫలితం ఇచ్చిన నేపథ్యంలో వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులను కాగ్ తప్పు పట్టిన నేపథ్యంలో ఆ వివరాలను పొందు పరుస్తూ పుస్తకాలు రాసి, అచ్చేసి ప్రధానికి, ఇతర ప్రముఖులకు పంచి పెట్టాలని అనుకుంటున్నారు.

రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చేలోగా పుస్తకాలను బయటకు తెచ్చి నియోజకవర్గాల్లో పంచాలని చంద్రబాబు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తమ పని సులభం అవుతుందని భావిస్తున్నారు. అవినీతి ప్రధాన ఎజెండాగా వైయస్ జగన్‌‌పై ఎదురుదాడికి దిగాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. పైగా, తమకు ప్రధాన ప్రత్యర్థి వైయస్ జగన్ తప్ప కాంగ్రెసు కాదనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెసును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాంగ్రెసు పూర్తిగా బలహీనపడిందని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, జగన్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నారు. ఉప ఎన్నికలు జరిగే 18 శాసనసభా స్థానాల్లో పరకాల మినహా మిగతా స్థానాలన్నీ సీమాంధ్రలోనే ఉన్నాయి. అందుకే వైయస్ జగన్‌ను టార్గెట్ చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

జగన్తో గొడవపడి వైయస్ హెలికాప్టర్ ఎక్కారు!: వర్ల


వైయస్‌కు ఎప్పుడూ అత్యంత నమ్మకంగా ఉంటూ భద్రత వ్యవహారాలు చూసే సూరీడు ఈ కారణంగానే జగన్ దగ్గరకు వెళ్ళకుండా దూరంగా ఉండిపోయినట్లుగా వింటున్నామని ఆయన చెప్పారు. అలాగే వైయస్ ఆత్మబంధువు కెవిపి రామచంద్ర రావు కూడా జగన్‌తో కలవకుండా దూరంగా ఉండడానికి కారణమిదేనా? అని ప్రశ్నించారు. వైయస్ చనిపోయిన మర్నాడు అందరూ ఆ పరిణామానికి విషాదంలో మునిగిపోయి ఉంటే జగన్ మాత్రం తన తండ్రి పదవిని సంపాదించుకోవడం కోసం సంతకాల సేకరణలో మునిగితేలాడని, ఇలాంటి కొడుకు ఉండాలని ఏ తండ్రీ కోరుకోడని మండిపడ్డారు. అప్పట్లో తన మాట వినని అధికారులను బెంగళూరు తీసుకెళ్ళి జగన్ నెలల తరబడి బంధించాడని, ఆయన బండారం బయటపెడతామని చెప్పారు.

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల వర్ల తీవ్రంగా ప్రతిస్పందించారు. జూపూడి మాటలు సభ్య సమాజంలోని వ్యక్తుల మాటల్లా లేవని ధ్వజమెత్తారు. ఆకాశంలో నక్షత్రం వెలిగిందంటే చంద్రబాబు సమాధానం చెప్పాలా? చంద్రబాబు ఢిల్లీకి బహిష్కృతుడా? ఢిల్లీ వెళ్ళకూడదా? జగన్ కారుకు వెనుక టైరు పగిలిపోతే దానికి కూడా చంద్రబాబే సమాధానం చెప్పాలా? అని వర్ల ప్రశ్నించారు. ఒక మిత్రుడి తల్లి చనిపోతే అతనిని పరామర్శించేందుకు చంద్రబాబు వెళ్లారని, దానిమీద కూడా నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మాట్లాడడం జూపూడికి తగుతుందా అని నిలదీశారు.

మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం వైయస్సార్ కాంగ్రెస్‌కు అలవాటేనని దుయ్యబట్టారు. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయగానే ప్రధాని పాదాలవద్ద సాగిలపడి, ఆ తర్వాత మీ అధినేత జగన్ ఏం మాట్లాడాడో సాక్షి పత్రికలు తిరగేసి చూసుకోవాలని జూపూడికి హితవు పలికారు. జగన్ ఒక అవినీతిపరుడని, కోట్ల రూపాయలు కొట్టేశాడని సిబిఐ చార్జిషీట్ వేసిందని, అలాంటి జగన్ రోడ్లపై నిస్సిగ్గుగా తిరగవచ్చా? మేం మాత్రం ఢిల్లీకి వెళ్ళకూడదా? అని ప్రశ్నించారు. జగన్ అవినీతిపరుడని ఆధారాలతో నిరూపిస్తానని, నా చాలెంజ్‌కు సిద్ధమా అని జూపూడికి సవాల్ విసిరారు.

Wednesday, April 4, 2012

విదేశాల్లో మూడొంతులు టిడిపి అభిమానులే: బాలకృష్ణ


లండన్: విదేశాల్లో ఉన్న తెలుగువారిలో మూడొంతులకు పైగా తెలుగుదేశం పార్టీ అభిమానులేనని నందమూరి హీరో, టిడిపి నేత బాలకృష్ణ మంగళవారం అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి విస్తరణ కోసం ఆయన విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన లండన్‌లో ఎన్నారై టిడిపి కార్యకర్తలు, పార్టీ అభిమానుల సమావేశంలో మాట్లాడారు. తన తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పారు.

ఇకపై టిడిపిలో యువతదే ప్రముఖ పాత్ర అని చెప్పారు. రాజకీయాల్లో అవినీతిని, దగాకోరుతనాన్ని అడ్డుకోవడానికి యువత నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అనుసరించిన విధానాల మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్షల మంది యువకులకు విదేశాల్లో ఉపాధి లభించిందన్నారు. అంతకుముందు ఆయన బ్రిటన్ పార్లమెంటును సందర్శించారు.

కాగా బాలయ్య అంతకుముందు వాషింగ్టన్‌లోనూ పర్యటించిన విషయం తెలిసిందే. సమాజంలో నానాటికి పెరిగిపోతున్న అవినీతిని, అస్తవ్యస్థ పరిస్థితులను అంతం చేసేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు బాలకృష్ణ అప్పుడు చెప్పారు. ఆయన లండన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో శుక్రవారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు దిగజారాయని, నేతల్లో నైతిక విలువలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. యువత ముందుకు వచ్చి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తద్వారా రాజకీయాల్లో అవినీతి తగ్గుతుందన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తానని అన్నారు. తన తల్లి బసవతారకం పేరిట హైదరాబాదులో ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. కాగా కాబోయే ముఖ్యమంత్రి బాలకృష్ణ అంటూ పలువురు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget